Listen to this article

మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల

జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అన్నారు. అమలాపురం శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ జిల్లా పదాదికారులకు, కార్యవర్గ సభ్యులకు శనివారం మద్యాహం వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ జల్ జీవన్ మిషన్, విద్యుత్ ఆధునీకరణ, సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి లాంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్నారని అన్నారు. రేపట్నుంచి ప్రతీ గ్రామంలో సర్వే చేసి ప్రతీ వ్యక్తికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తాం అని అన్నారు. అనంతరం బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల లంక గ్రామాల ప్రజలు నష్టపోతున్నారని, నదీకోత వలన లంక గ్రామాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయని వాటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. అమలాపురం లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని అన్నారు. జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ రైతులకు నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. ఫసల్ బీమా యోజన, నేడు కిసాన్ సమ్మాన్ నిధి రైతుల అకౌంట్ లో వేస్తున్నారని అన్నారు. కేంద్రం లోనూ, రాష్ట్రం లోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా ఇంచార్జీ కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక ఉన్నత చదువులు చదివిన వారికి సచివాలయ ఉద్యోగులు పేరుతో చిన్న చూపు చూసేలా చేశారని, వారికి ఈ ప్రభుత్వంలోనైనా వాళ్ల చదువుకు సరిపోయే విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకురు మెల్లి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, కొప్పాడి దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.