

జనంన్యూస్. 02. సిరికొండ
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని. ఏఐపి కెఎంఎస్.ఆధ్వర్యంలో ఆగస్టు 20వరకు గ్రామపంచాయతీ ముందు ఆందోళనలు 21నుండి 30 వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు ఆగస్టు05న ధర్నా, సెప్టెంబర్10నఛలోసెక్రటేరియట్. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుజి. కిషన్, ఇ. రమేష్ ల వెల్లడి. శనివారం నాడు సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు., తాము చేపట్టనున్న ఆందోళనల కరపత్రాలను ఆవిష్కరణ చేశారు.ఈసందర్బంగా అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. కిషన్, ఇ. రమేష్ లుమాట్లాడుతు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని కానీ ఆ హామీ అమలు చేయడంలో మీనావేశాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. రెక్కలు తప్ప ఆస్తులు లేని వ్యవసాయ కూలీలను ప్రభుత్వం విస్మరిస్తుందని వారు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో వ్యవసాయ కార్మికులు ఉండగా తూతూ మంత్రంగా అక్కడక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఇందిర ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రతి వ్యవసాయ కూలికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయకులకు ఇవ్వాల్సిన ఇందిరా ఆత్మీయ భరోసా సంపూర్ణ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 20 వరకు గ్రామ పంచాయితీల ముందు ధర్నాలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆగస్టు 21 నుంచి 30 వరకు తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన, సెప్టెంబర్ ఐదు నాడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, సెప్టెంబర్ 10 నాడు చలో సెక్రటేరియట్ చేపడుతున్నామని వారు ప్రకటించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తాము ఆందోళనలు చేపడుతున్నట్లు, ప్రభుత్వం దిగరాకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఏఐపీకేఎంఎస్ పిలుపుని అందుకుని వ్యవసాయ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కే. రాంజీ, జి. బాల్ రెడ్డి, సహాయ కార్యదర్శులు జి. సాయిరెడ్డి, ఏ. అశోక్, డి. దయల్ సింగ్,జి. ఎర్రన్న,కోశాధికారి ఎస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.