

జనం న్యూస్ ఆగస్టు 2 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అంగన్వాడి సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు
చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలిగృహ సందర్శనలు చేసి అవగాహన కల్పించాలిసిడిపిఓ హేమ భార్గవి చిలిపి చెడు అంగన్వాడి టీచర్లు గృహ సందర్శన నిర్వహించి పిల్లల తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ నర్సాపూర్ ప్రాజెక్ట్ సిడిపిఓ హేమా భార్గవి మేడం తెలిపారు.శనివారం మండలంలోని చండూరు గౌతపుర్ చిలప్చెడ్ అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి అక్కడ ఉన్న అతి తీవ్ర లోపపోషణ పిల్లలని ఎత్తుమరియు బరువులు స్వయంగా చూసి వారి తల్లిదండ్రులతో సమావేశమై పిల్లలకు లోప పోషణ రావడానికి కారణాలు గురించి తల్లిదండ్రులకు వివరించారు. తల్లికి గర్భం దాల్చినప్పుడు లేదా డెలివరీ సమయంలో సమయంలో ఏమైనా సమస్యలు వచ్చాయా లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అని అడిగి తెలుసుకుని పిల్లలపై ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయవద్దు అని తెలియపరిచారు.ప్రతి గర్భిణీ స్త్రీలకు ముర్రుపాలు ప్రాముఖ్యత గురించి వివరించారు .పిల్లలకు ఎలాంటి ఆహారం తినిపించాలో ఏ సమయానికి ఎంత మోతాదులో తినిపించాలో వారికి వివరంగా తెలియపరచడం జరిగింది . పిల్లలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే స్థానిక పి హెచ్ సి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని తెలిపారు.అంగన్వాడి విదులపట్ల నిర్లక్షం వహిస్తే కటిన చర్యలు ఉంటాయని టీచర్స్ కి అయాలకి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్ సంతోషి మాతా మరియుఅంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు