

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 2 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం లోని తిమ్మరాజుపాలెం అంగన్వాడీ సెంటర్ నందు తల్లి పాల ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పసుమర్రు సెక్టార్ సూపర్వైజర్ టి.ప్రసన్న కుమారి పాల్గొనడం జరిగింది. ఆమె మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గర్భిణీ స్త్రీ గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. పప్పులు గుడ్లు పాలు వంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అలాగే అంగన్వాడి సెంటర్ లో అందించేటువంటి వివిధ రకాల సేవలను గర్భవతులు ఉపయోగించుకొవాలని తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డ ద్వారా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడి కార్యకర్తలు పల్లెపోగు అమృత కుమారి, లావణ్య, నాగలక్ష్మి కుమారి బొంత రేచల్ కుమారి, కిరణ్ కుమారి, ఈశ్వరమ్మ, పుణ్యవతి మరియు ఆయాలతోపాటు గర్భిణీ స్త్రీలు, బాలింతలు స్థానిక మహిళలు పాల్గొన్నారు.