

జన న్యూస్;2 ఆగస్ట్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
సిద్ధిపేటలోని శ్రీవాణి స్కూల్ భారత్ నగర్ లో శనివారం రోజునా ఫ్రెండ్‌షిప్ డే ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఒకరినొకరు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టి తమ అనుబంధాన్ని వ్యక్తపరిచారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలతో కలిసి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటూ స్నేహం విలువను వివరించారు. స్కూల్ ఆవరణ మొత్తం ఉత్సాహంగా మారింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం మాట్లాడుతూ –
“స్నేహం మన జీవితంలో గొప్ప బంధం. మీరు మంచి స్నేహితులు అయి ఎదురు వారిని సాయం చేయగలగాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.