Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 02(నడిగూడెం)

ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వేణుగోపాలపురం గ్రామంలో సంపతి అచ్చమ్మ అధ్యక్షతన నిర్వహించిన మహిళ ఆక్సలరీ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారా కాకుండా ఆధార్ లింక్ ఉన్నా జీరో అకౌంట్ బ్యాంకులలో డబ్బులు వేయడం ద్వారా ఆ బ్యాంక్ ఖాతాలు రన్నింగ్ లేనందున డబ్బులు రాక కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పోస్ట్ ఆఫీస్ ద్వారానే చెల్లింపులు చేయాలని ఆయన అన్నారు. కూలీలకు చెల్లించాల్సిన ఉపాధి హామీ నిధులు వెంటనే చెల్లించాలని పశువుల కొట్టాలు వేసుకున్న వారికి ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వలేదని వెంటనే వారి బిల్లులు చెల్లించాలన్నారు.ఈ సమావేశంలో శాఖా కార్యదర్శి సంపతి పిచ్చయ్య, సంపతి అచ్చమ్మ,కవిత,మాతంగి లింగమ్మ, సంపత్ రాధ, యాతాకుల రజిని, బుచ్చమ్మ,సంపత్ శ్రీలత, మాసి పూజిత, రాంబాయి, సంపత్ కళ్యాణి,పున్నమ్మ, బెజవాడ గోపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.