Listen to this article

జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం:


ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం మండలంలోని తిమ్మరాజుపేట అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వైద్యాధికారణి డాక్టర్ షకినా జాయ్ మాట్లాడుతూ తల్లిపాల వల్ల పుట్టిన శిశువుకు సరైన పోఫణ అంది రోగ నిరోధకశక్తి పెరిగి అలర్జీ ప్రమాదాలు తగ్గుతాయని, పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టాలని తల్లిపాలు శిశువుకు అమృతం లాంటిదని,తల్లిపాలు శిశువుకు సులువుగా జీర్ణమవుతాయని, బ్రెయిన్ డెవల్‌పమెంట్‌ ఉంటుందన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి భాగ్యలక్ష్మి శివ బాపు నాయుడు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు స్నేహభరిత సేవాభావం తల్లికి, తన బిడ్డకు ముర్రుపాలు ఇచ్చేందుగు ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి వెంకట అప్పారావు మాట్లాడుతూ తల్లిపాలు ఇవ్వడంలో అపోహాలను నిజాలను కొన్నిటిని ముర్రిపాలు పిండి పడేయాలనడం అపోహ ముర్రిపాలు శిశువుకు మొదటి వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తున్నదని నిజం. గర్భంతో ఉన్నప్పుడు తల్లి కోడి గుడ్డు తింటే పుట్టే బిడ్డ బోడిగుండుతో పుడుతుందన్నది, ప్రసవం తర్వాత పప్పు పదార్థాలు తినరాదన్నది,కాన్పు తర్వాత మంచినీరు ఎక్కువగా తాగితే పొట్ట వస్తుందనుకోవడం, తల్లి పాలు ఇవ్వడం ద్వారా అందం కోల్పోతారన్నది అపోహాలు మాత్రమే.పాలిచ్చే తల్లి తిరిగి తన పూర్వస్థితికి చేరుకుంటుందని నిజం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక అనకాపల్లి వారు ప్రచురించిన కరదీపికులను గర్భవతులకు, బాలింతలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో ఇందిరా దేవి, సూపర్‌వైజర్‌ పద్మావతి , ఎంఎల్హెచ్పి. జోత్స్న ఏఎన్ఎం లక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు భారతి, వెంకటలక్ష్మి, ఆశాలు పార్వతి ,గీతా మహిళా పోలీస్ బేగం.గర్భవతులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.