Listen to this article

వైసీపీ యువ నేత, వైసీపీ స్టేట్ మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి .

తన మనసులోని మాటను ధైర్యంగా ఒప్పుకున్న చంద్రబాబు

కుమారుడు లోకేష్‌ను ప్రమోట్ చేసుకునేందుకు తిప్పలు

అధికారిక ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు

ప్రభుత్వ ప్రకటనలో లోకేష ఫోటో ఎలా వాడతారు..?

కంభం ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్):

తాడేపల్లి: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం సందర్బంగా చంద్రబాబు తాను బతికి ఉన్నంత వరకు రైతులకు భరోసా ఉండదూ…ఉండదూ… అంటూ మనసులోని నిజాన్ని బయటపెట్టారని వైయస్ఆర్‌సీపీ అధికార స్టేట్ మున్సిపల్ విభాగం జనరల్ సెక్రెటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దర్శిలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు తన హయాంలో ఎటువంటి భరోసా ఉండదని, ఇది తన వాగ్ధానం అంటూ రైతుల పట్ల ఆయనకు ఉన్న వ్యతిరేకత, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న ద్వేషాన్ని చాలా ధైర్యంగా ప్రకటించారని అన్నారు. తన కుమారుడు నారా లోకేష్‌ ను ప్రమోట్ చేసుకునేందుకు అన్నదాత సుఖీభవ ప్రారంభానికి సంబంధించిన అధికారిక పత్రికా ప్రకటనల్లో సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే… రైతుల పట్ల చంద్రబాబుకు ఉన్న వైఖరి, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న చులకన భావాన్ని చాటుకున్నారు. అదే ఈ రోజు జనాల సాక్షిగా చంద్రబాబు ఒప్పుకున్నారు. ఆయన మాటలకు సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎక్కడా రైతులు సుఖంగా లేరు. వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కడా గిట్టుబాటు రేటు లేక, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వారిని ఆదుకునే ఆలోచనే ఏ ఒక్కరోజు చంద్రబాబు చేయలేదు. చివరికి ఎన్నికలకు ముందు కేంద్రంతో సంబంధం లేకుండా రైతుకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తాను అని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం ఇచ్చే రూ.6 వేలను కూడా కలుపుకునే రూ.20 వేలు ఇస్తానంటూ మోసం చేస్తున్నాడు. గత ఏడాది ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు మొదటి విడతగా రాష్ట్రం వాటా కింద రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు కలిపి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం. ఇచ్చిన ఏ మాట మీద నిలబడటం చంద్రబాబుకు చేతకాదు. ఇచ్చే రైతుల సంఖ్యను కూడా దాదాపు ఏడు లక్షల వరకు కుదించారు. లోకేష్‌ ఫోటో వేసి బీసీ మంత్రిని నిర్లక్ష్యం చేస్తారా..? ఈ పథకం అమలు సందర్భంగా పత్రికల్లో లక్షల రూపాయలు ఇచ్చి ప్రచురించుకున్న ప్రభుత్వ ప్రకటనల్లో సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలను ఉల్లంఘించారు. ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ ఫోటోను కూడా ప్రభుత్వ ప్రకటనలో ప్రచురించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యవసాయశాఖ మంత్రి మాత్రం ఆ ప్రకటనలో చంద్రబాబు, లోకేష్‌ ఫోటోలతో పాటు వేయడానికి పనికి రాలేదా.? నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు ప్రుతవాత్సల్యంతో చేస్తున్న పనులు ఇవి.