జనం న్యూస్ ఆగస్టు 3 మంథని టౌన్ రీపోటర్ కుంట పోశెట్టి నియోజక వర్గం పర్యటనలో ఉన్నతెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎక్లాస్ పూర్ జెడ్ పి హెచ్ ఎస్ లో శనివారం డీజేఎఫ్ 5వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. డిజెఎఫ్ 5వ రాష్ట్ర మహాసభ ఆగస్టు 10న జరగనున్నది. డీజేఎఫ్ మహాసభకు ముఖ్యఅతిథిగా ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ సభ్యులు మంథని లక్ష్మణ్, ఏగోలపు సంతోష్, రావుల రాజ్ కుమార్, నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


