Listen to this article

జనం న్యూస్ ఆగష్టు02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణలో పదేళ్లు గా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ అన్నారు శనివారం వాంకిడి మండల కేంద్రం లోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయక, రేషన్ కార్డులలో చేరికలకు అవకాశం కల్పించక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజాపాలనలో పేదల రేషన్ కార్డుల కల నెరవేర్చడమే క కల్పించిందన్నారు సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆహారభద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారుకార్డుల పంపిణీకి మహిళ లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారని పదేళ్ల కల కాంగ్రెస్ సాకారం చేసిందనడానికి ఇదే నిదర్శనమన్నారు నూతనంగా రేషన్ కార్డుల పొందిన లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలు కూడా అందుతాయని పేదల పదేళ్ల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ,మంత్రివర్గానికి, అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమం , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు1