

జనం న్యూస్ ఆగష్టు 02 ఆసిఫాబాద్.జిల్లా బ్యూరోకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్, ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తరంజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, షీ టీం ఆధ్వర్యంలో ” బాలికల భద్రత – విద్య వల్ల జీవిత విజయం ” అనే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం చింతల మానేపల్లి మండలం లోని బాబా పూర్ లోని గవర్నమెంట్ హై స్కూల్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కౌటాల సిఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థులు మంచి నడవడికను కలిగి ఉండాలని, క్రమశిక్షణతో మెలగాలని, శ్రద్ధాసక్తులతో విద్యను అభ్యసించాలని అన్నారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని, పేర్కొన్నారు. బాలికలకు ఇతర కారణాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు లేదా తల్లిదండ్రులకు తెలపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చింతల మానేపల్లి ఎస్సై నరేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం , షీ టీం సిబ్బంది స్వప్న, రజిని, దినేష్ లు పాల్గొన్నారు.