Listen to this article

జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) ఆగస్టు 3 రైతులు కళ్ళల్లో ఆనందం చూసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.మండపేట శ్రీ సీతా రామ కళ్యాణ మండపం లో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారనీ పేర్కొన్నారు.మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ 20 వేలు లబ్ది చేకూరే పరిస్థితి వుందన్నారు. మండపేట నియోజక వర్గంలో మొత్తం 18, 229 మంది రైతులకు అన్నదాత సుఖీభవ రూ 9.11 కోట్లు, ప్రధాన మంత్రి కిసాన్ ద్వారా రూ3. 38 కోట్లు మొత్తం రూ 12.49 కోట్లు లబ్ధిచేకురుతుందని వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వారి పక్షాన నిలిచిందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యం గా పేర్కొన్నారు. ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్, జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో పనిచేసిన ముఖ్య మంత్రులు అందరూ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తే గత వైసిపి హయం లో రైతులను మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చిన వెంటనే ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు గత ప్రభుత్వ హయాంలో బకాయి పడ్డ సొమ్ములు తక్షణమే చెల్లించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, ఎంపిపి వుండమట్ల వాసు, మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, నల్లమిల్లి వీర్రెడ్డి, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, మాదిగ కార్పోరేష్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్ దొరబాబు, టిడిపి టౌన్ అద్యక్షులు మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, జన సేన టౌన్ అద్యక్షులు నామాల చంద్రరావు, రైతు నాయకులు మల్లిపూడి గణేష్,బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, మండపేట నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కోటిపల్లి వివి సాయి రామ్,నియోజక వర్గ ప్రత్యేక అధికారి సివిల్ సప్లైస్ డి ఎం శ్రీనివాస్, ఆలమూరు వ్యవసాయ శాఖ ఏ డి సీహెచ్ కేవీ చౌదరి, మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండల వ్యవసాయ శాఖ అధికారి లు కే ప్రభాకర్ , బి రవి, ఎన్ వి రమేష్ కుమార్, మండపేట తహసిల్దార్ తేజేశ్వరరావు, ఎంపిడిఓ సత్యనారాయణ ,సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ లు కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.