Listen to this article

జనం న్యూస్ చౌటుప్పల్ ప్రతినిధి జనవరి 27:- కళా నేతల కళా ప్రదర్శన చౌటుప్పల్ లోని బస్ స్టాండ్ ఆవరణ నుండి అంటేద్కర్ చౌరస్తా వరకు అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ ఆవరణ వరకు డప్పులతో ర్యాలీ, యస్సీ వర్గీకరణ రాష్ట్రం లో అమలు చేయాలనీ డిమాండ్ తో ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తలపెట్టిన లక్ష డప్పులు వేల గౌంతుల ఆత్మగౌరవ సాంస్కృతిక ప్రదర్శన జయప్రదం చేయడం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన మాదిగలను సబ్బండ కులాలను ఏకం చేస్తూ కళా నేతల బృందం 20 రోజులుగా పర్యటన చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రం కు చేరుకుంది. ఈ సందర్భంగా చౌటుప్పల్ లో డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సాంస్కృతిక ప్రదర్శిన సభ వేదిక వద్ద డప్పుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పియస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, ఎమ్మార్పియస్ జిల్లా అధ్యకులు దుబ్బ రామకృష్ణ మాదిగలు మాట్లాడుతూఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం లేదని కానీ కొందరు మాలలు స్వార్ధపరులు కల్పిస్తున్న అడ్డంకుల వల్ల మాదిగ బిడ్డలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి మాదలకు అన్యాయం చేశాడని అన్నారు రేవంత్ రెడ్డి మీద మాలల ఒత్తిడి ఉన్నప్పటికీ మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ అమలులో తీసుకురావడానికి చిత్తశుద్ధితో ముందుకు నడుస్తాడని ఆశిస్తున్నామని. అన్నారు. మాలలకు కొమ్ము కాసి ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ తగిన రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు ఎస్సీ వర్గీకరణ న్యాయం కాబట్టి యావత్ సమాజం ఉద్యమానికి అండగా నిలబడుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అలాగే జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవడం కోసం ఫిబ్రవరి 7న ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్న నేత్రుత్వంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని వచ్చే ప్రతి ఒక్కరు వెంట డప్పు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళా నేతల ఉమ్మడి జిల్లా అధ్యకులు కాటిపాక శంకర్ మాదిగ, యాదాద్రి జిల్లా కళానేతల అధ్యక్షులు మీసాల గణేష్ మాదిగ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు బోయ దేవేందర్ మాదిగ, కౌన్సిలర్ కొరగోని లింగ స్వామి మాదిగ, యం యెస్ పీ జిల్లా అధికార ప్రతినిధి సందేల శ్రీనివాస్ మాదిగ, మాజీ ఉమ్మడి జిల్లా యం యస్ ఎఫ్ అధ్యకులు తుర్పింటి రవి మాదిగ, మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు ఊదరి వెంకటేష్ మహాజన్, సీనియర్ రాష్ట్ర మాదిగ ఉద్యోగ నేతలు బోయ మల్లేష్ మాదిగ, బోయ రాము మాదిగ, జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు ఊదరి శ్యామ్ సుందర్ మాదిగ, ఎమ్మార్సియస్ మండల అధ్యక్షులు – శ్రావణ్ మాదిగ,జర్నలిస్ట్ మండల అధ్యక్షులు ఆరుట్ల లింగ స్వామి మాదిగ, కట్టెల లింగ స్వామి మాదిగ, బోదుల లింగ స్వామి మాదిగ, సుక్క అర్జున్ మాదిగ, రుద్రల యాదగిరి మాదిగ, కానుకుంట్ల సవీన్ మాదిగ, కళా నేతల సంఘం నాయకులు పిట్టల శ్రీనివాస్, ఎమ్మార్సియస్, యం. యస్ పీ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు.