

జనం న్యూస్ 3 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుండి రైతుల ఖాతాలో వేయడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఇట్టి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించినట్టు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది 6వేల నగదును అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో విడతలో 2000 రూపాయల చొప్పున మూడు విడతలలో మొత్తం నగదు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లో బదిలీ చేస్తారని అన్నారు ఈ పథకం కింద సుమారు 13 కోట్ల మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి కృష్ణ, ఏఈఓ వెంకటేష్, బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల ఉపాధ్యక్షులు బేగరీ వినోద్ కుమార్, భోజిగొండ అనిల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఓదెల సతీష్ పవర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, మండల కార్యదర్శి ఎర్రోళ్ల శంకర్, బేగరీ సాయికుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.