

జనం డిజిటల్ న్యూస్ జూలై 2 (నిర్మల్ జిల్లా స్టాపర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభమయ్యే జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర బాదన్ కుర్తి గ్రామం నుండి శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాదన్ కుర్తి గ్రామంలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహానికి పూలమాలవేసి మస్కాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఖానాపూర్ నియోజకవర్గం లో అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి మరియు శివాజీ విగ్రహానికి. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఒక పాదయాత్రను తర్వాతి రోజు ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రతి వార్డు వార్డుకు తిరుగుతూ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పాదయాత్రలో ఖానాపూర్ నియోజకవర్గం నుండి కాకుండా అదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఖానాపూర్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.