

జనం న్యూస్ ఆగస్టు 2 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(ఎ) లో 2024-2025 సంవత్సరంలో బిఏ లిటరేచర్ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన పి.జి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తెలుగు విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన ఎస్. పవిత్రకు మరల పి హెచ్. డి ఎంట్రన్స్ లో మొదటి ర్యాంక్ రావడం గర్వకారణం. ఈ అమ్మాయితో పాటు మరో పూర్వ విద్యార్ధి బి. పరమేష్ కు 6 వ ర్యాంక్ వచ్చింది. గత రెండు నెలల క్రితం విడుదల అయిన యు జి సి నెట్ ఫలితాలలో ఇద్దరికీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జె ఆర్ ఎఫ్) కూడా క్వాలిఫైడ్ కావడం ఎంతో సంతోషదాయకం. ఇద్దరు విద్యార్థులు బీదరికాన్ని అనుభవిస్తూ అంచెలంచెలుగా ఎదగడం పాలెం తెలుగు లీటరెచర్ బి. ఏ. (ఎల్ )కోర్స్ అందించిన జ్ఞానమే కారణమని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాములు తమ అధ్యాపక బృందం తో కలిసి అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థిని పవిత్ర, పరమేష్ లకు శాలువా కప్పి సన్మానించారు. పాలెం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ (ఎల్) చదివి హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో సీట్లు సాధించడం అభినందనీయం.జీవితంలో ఉన్నతమైన విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ డాక్టర్ వర్కాల శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ సుష్మ, డాక్టర్ నాగరాజు,శివ, డాక్టర్ రాధాకుమారి, డాక్టర్ స్వప్న,కె. రవికుమార్, జి రమేశ్,మనోజ్ కుమార్, ప్రకాష్ బాబు, యాదగిరి, మహేశ్వర్ జి, సీనియర్ అసిస్టెంట్ కవిత, జూనియర్ అసిస్టెంట్ లు అక్బర్,కుర్మయ్య, రికార్డ్ అసిస్టెంట్ బాలస్వామి, ఆఫీస్ సబార్డినేట్ నగేష్ పాల్గొన్నారు.