Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 71ప్యాకెట్లలోగల 145కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 2న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఆగస్టు 1న గొల్డాం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి, ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 71 ప్యాకెట్లులోగల 145 కిలోల గంజాయి, కెఎల్ 10పి 9473 నంబరుగల బొలెరో వాహనంను సీజ్ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో (ఎ-1) ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పదువ మండలం కుదుబ్ గ్రామానికి చెందిన డంబు శిరగం @ కృష్ణ (21 సం.లు) (ఎ-3) కేరళ రాష్ట్రం ఖసర్గాడ్ మంజెవరం మండలం హెూసంగలి గ్రామానికి చెందిన మొహమ్మద్ షఫీక్ (36 సం.లు)గా విచారణలో గుర్తించామన్నారు. నిందితుడు (ఎ-3) కేరళ రాష్ట్రం ఖసర్గాడ్ మంజెవరం మండలం హెూసంగలి గ్రామానికి చెందిన అబుబాకర్ సిద్ధికి (ఎ-2) ఆదేశాలతో గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలో (ఎ-1) డంబు శిరగం అలియాస్ కృష్ణ వద్ద కొనుగోలుచేసి బొలెరో వాహనంలో కేరళకు తరలిస్తుండగా చేస్తుండగా ఎల్.కోట పోలీసులు గొల్జాం వద్ద వాహన తనిఖీలు చేపట్టి, పట్టుకున్నారన్నారు. బొలోరో వాహనంతోపాటు
145 కిలోల గంజాయిని సీజ్ చేసామన్నారు. కేరళ రాష్ట్రం ఖసర్గాడ్ మంజెవరం మండలం హెూసంగలి గ్రామానికి చెందిన (ఎ-2) అబుబాకర్ సిద్దికిని త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులను రిమండుకి తరలించామన్నారు. నిందుతులపై ఫైనాన్సియల్ ఇన్విస్టిగేషను, పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తామని, పి.డి.చట్టంను కూడా ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కేసులో నిందితులను అరెస్టు, గంజాయిని సీజ్ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పల నాయుడు, ఎల్.కోట ఎస్ఐ నవీన్ పడాల్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పల నాయుడు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఎల్.కోట ఎస్ఐ నవీన్ పడాల్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.