Listen to this article
  • * మిట్టకంకల్, కడుమూరు పాఠశాలలకు జిరాక్స్ మిషన్స్ అందజేసిన మోర్రి చిన్న బందయ్య (అనిల్ )

జనం న్యూస్ 27 జనవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ ) విద్యార్థులు, విద్యతోపాటు అన్ని రంగా ల్లో రాణించాలని హైకోర్టు న్యాయవాది కడుమూరు ఆనందం పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో 76వ, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. అనంతరం మిట్ట కంకల్ గ్రామానికి చెందిన మొర్రి చిన్న బందయ్య (అనిల్ ) మిట్టకంకల్, కడుమూరు పాఠశాలలకు జిరాక్స్ మిషన్స్ ను హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మోసెస్, ప్రైమర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మధు, మిట్టకంకల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. పాఠశాలకు ఏ అవసరం ఉన్న తన వంతు సహాయంగా అన్ని వేళల్లో సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్యాం కుమార్, రిటైర్డ్ డిఎస్పి రాములు, ఎస్ఎంసి చైర్మన్ వెంకటస్వామి, మాజీ ఎంపిటిసిలు పోచయ్య, మాణిక్యం గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు యువకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.