 
									 
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మహిళలు, బాలల భద్రతకు జిల్లా పోలీసుశాఖ ప్రాధాన్యత కల్పిస్తుందని, అదృశ్యమైన బాల, బాలికలను కనుగొనేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాలతో ‘ఆపరేషను ట్రేస్’ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఇందులో భాగంగా గజపతినగరం పురిటిపెంట నుండి అదృశ్యమైన బాలికను గంటల వ్యవధిలో ట్రేస్ చేసి, ఆమె తల్లికి ఆగస్టు 1న అప్పగించామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మహిళలు, బాలబాలికల భద్రతకు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నదన్నారు. బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించుటకు జిల్లాలో వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, తమను తాము రక్షించుకొనేందుకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను నేర్పిస్తున్నామన్నారు. అదే విధంగా గతంలో అదృశ్యమైన మహిళలు, బాలికల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టామని, రాష్ట్ర డిజిపి గారి ఆదేశాలతో ‘ఆపరేషన్ ట్రేస్’ కార్యక్రమాన్ని
చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ ‘ఆపరేషన్ ట్రేస్’ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం మండలం మరుపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 15సం.ల బాలిక తన ఇంటి నుండి అదృశ్యమైనట్లుగా వచ్చిన ఫిర్యాదు మేరకు గజపతినగరం పోలీసులు మిస్సింగు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. బాలిక ఆచూకీని కనుగొనేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసారన్నారు. బాలిక ఫోటోను ఈ బృందాలకు అప్పగించి, ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టి, పురిటిపెంట ప్రాంతంలోని వలు సిసి ఫుటేజులను
పరిశీలించి, బాలిక మరుపల్లి వైపు వెళ్ళుతున్నట్లుగా గుర్తించి, గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీని కనిపెట్టి, బాలిక తల్లికి అప్పగించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాలిక ఆచూకీని గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి, బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించుటలో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.


