 
									 
జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ప్రజ్వల్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కార్యకర్త పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయ అధికారి గంగా జమున హాజరై మాట్లాడుతూ పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి నాణ్యమైన దిగడులు సాధించాలన్నారు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా రైతులందరూ పత్తి పంటలో అంతర పంటలు ,రక్షక పంటలు వేయాలి . రసం పీల్చు పురుగు నివారణకు జిగురు అట్టలు కాయతోలుచు పురుగు ఉనికి తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలు లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. రసం పీల్చుపురుగు అయినటువంటి పె నుబంక ,పచ్చ దోమ ,తామర పురుగు నివారణకు వావిలా కషాయం,వేప గింజల కషాయం లాంటివి పిచికారి చేయాలి అన్నారు . కాండానికి బొట్టు పెట్టే పద్ధతి పాటించాలన్నారు. రైతులు ఎచ్ పి పి అత్యధిక విషపూరిత పురుగుమందులకు మోనోక్రోటోపాస్ లాంటి వాటికిబదులుగా వావిలాకు కషాయం, వేప గింజల కాషాయం లాంటివి పిచికారి చేయాలి అన్నారు. పురుగు మందులు పిచికారి చేసే సమయంలో రైతులందరూ పి పి ఇ వ్యక్తిగత రక్షణ దుస్తులు ధరించాలన్నారు .అనంతరం గ్రామంలోని ఎనిమిది మంది రైతుల ఫీల్డ్లు విజిట్ చేశారు . రసం పీల్చు పురుగు నివారణకు కాండానికి బొట్టు పెట్టే పద్ధతి గుండెకారి శ్రీనివాసు ఫీల్డ్ లో డెమోన్స్ స్టేషన్ చేశారు . ఫీల్డ్ ఫెసిలిటేటర్ పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో రైతులకు జిగురు అట్టలు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఫెసిలిటేటర్ పోరాండ్ల భానుమతి , హుస్సేన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ రైతులు పాల్గొన్నారు…..


