Listen to this article

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా 4/8/2025


శ్రీ గురుద్వార్ సాహెబ్ గత 60 సంవత్సరాల నుండి గురుద్వార్ సాహెబ్ జోగిపేటలో మందిరం చిన్నగా ఉండే దానిని ఇప్పుడు నూతన మందిరం మరియు 31 ఫీట్ల గజ స్థంభం, నిషాన్ సాహెబ్ మూడు రోజుల అఖండ పాట్ చేసి ఇనాగరేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సికాలిగర్ సంఘం ప్రెసిడెంట్ దర్యాసిన్ ఆధ్వర్యంలో నూతన మందిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర సికిలిగర్ సంఘం అధ్యక్షులు కాలనీ ఆనంద్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ బౌరి జగన్ సింగ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గుళ్ళు సింగ్, మునర్ సింగ్, సంసర్ సింగ్, హీరో సింగ్, పవన్ సింగ్, మం జిత్ సింగ్, గులాబ్ సింగ్, చందు సింగ్, సుజిత్ సింగ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు హరిజిత్ సింగ్ తదితర వ్యక్తుల ఆధ్వర్యంలో గురుద్వారా ఆవిష్కరణ నిర్వహించారు.