Listen to this article

జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణంలోని 13వ డివిజన్‌లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, తదితరులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. తమ హయాంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, సంక్షేమ పథకాలతో వెలుగులు నింపామన్నారు.