

నిధులు లేవు అభివృద్ధి ఎలా ప్రజావాణిలో అధికారులు
(జనం న్యూస్4 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి)
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని అవి అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని. అందుకే పల్లెల అభ్యున్నతికి పాటుపడాలని వేదికలపై ప్రజా ప్రతినిధులు ఉపన్యాసాలు గుప్పిస్తుంటారు. కానీ వాస్తవంలో పల్లెల అభివృద్ధిని విస్మరిస్తున్నారు అనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. భీమారం మండల గ్రామాల్లోని ప్రజలు రాజ కీయంగా చైతన్యవంతంగా ఉంటారు. అలాంటి జనం ఉన్న గ్రామాల్లోనే పలు వీధులు నేటీకీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక మట్టి దారులే ఉన్నాయి. దీంతో చినుకు పడితే చాలు చిత్త డిగా మారి.. నడవాలంటే జనం పాట్లు చేయక తప్పని పరిస్థితి. అంతేగాక రోజుల తరబడి రోడ్డుపై మురుగు నిలువ ఉండి దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈసమస్యలపై సోమవారం రోజున ప్రజావాణిలో అడగగా అధికారులు నిధులు లేవు అభివృద్ధి ఎలా జరుగుతుందని అన్నారు.
