

జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు తమ సొంత వాహనాలకు గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్స్ వేసుకుని , వాహనాలకు పోలీస్ సైరన్, పోలీస్ సిగ్నల్ లైట్స్ అమర్చుకుని తిరుగుతున్నారని ఇట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు మానవ హక్కు లా సమితి రాష్ట్ర కోశాధికారి జి శివ శంకరాచారి స్థానిక నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ కు సంబంధించిన వాహనాలకు మాత్రమే గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్స్ వినియోగించాలని అనధికారికంగా తమ సొంత వాహనాలకు గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్స్ వేయించుకోవడం చట్టరీత్యా నేరమని, ప్రజలు తమ వాహనాల కు పోలీస్ సైరన్ అమర్చకూడదని తెలిపారు, ఇట్టి విషయమై ప్రజాప్రయోజనార్థం స్థానిక నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు మానవ హక్కు లా సమితి తరపున వినతి పత్రం ఇచ్చామని ఈ విషయంపై స్థానిక ఎస్సై ముత్తయ్య సానుకూలంగా స్పందించారని నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.