

అంగన్వాడి టీచర్ పార్వతి,సంతోషి,
జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ఘనపూర్ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల వరోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. చిన్నారుల తల్లులను తల్లిపాల విశిష్టతను తెలియపరిచారు.ప్రతి తల్లి తమ పిల్లలకు డబ్బాపాలు తాపకుండా తమ పిల్లలు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలంటే కచ్చితంగా తల్లిపాలని తాపాలని సూచించారు.తల్లిపాలు తాపడం వలన చిన్నారులు శారీరక దృఢత్వంతో పాటు, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని అన్నారు.గర్భిణీలు గర్భం దాల్చిన నుంచి తూచా తప్పకుండా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యంతో పాటు,తమ గర్భంలో పెరుగుతున్న శిష్పు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ లక్ష్మి,గ్రామ పెద్దలు సుదర్శన్ రావు, ఆకుల రాములు, జనార్దన్ రావు,ఆయ కవిత,పోచవ్వ బాలింతలు,గర్భిణీలు,తదితరులు పాల్గొన్నారు.