Listen to this article

జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జర్నలిస్టులు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి,అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ధర్నాను ఉద్దేశించి ఏపీ డబ్ల్యు జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కె రమెష్ నాయుడు మాట్లాడుతూ
జర్నలిస్టుల సమస్యల కోకొల్లలుగా ఉన్నాయన్నారు.ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా గురించి పట్టించుకునే వారు లేరన్నారు.పరిష్కారం జర్నలిస్టుల ఇంటిస్థలాల కేటాయింపు, మీడియా కమిటీ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు వయసుతో ప్రమేయం లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు .ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక ప్రచురణ పునరుద్ధరణ చేయాలన్నారు.సమాచార శాఖను బలోపేతం చేయాలి,అక్రిడేషన్లు జారీ చేయాలి,జర్నలిస్టులు అందరికీ రాయితీపై ఆంధ్రప్రదేశ్లో ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ డిమాండ్ చేశారు.జర్నలిస్టులు కమిటీ ఏర్పాటు చేయాలి,మీడియా అకాడమికి
గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించాలి,ఉద్యోగ భద్రత, కార్మిక బీమా సదుపాయం వర్తింప చేయాలి,ఆరోగ్య భీమా పై సమీక్ష,వృద్ధాశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు .అనంతరం వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కి అందజేశారు.ధర్నాలో ఫెడరేషన్ నాయకులు బూరాడ శ్రీనివాసరావు(ఎ బి ఎన్), యుగంధర్(సాక్షి),విజయలక్ష్మి,(ఏ ఎన్ఐ) చానల్ సునీతారెడ్డి(ఏం ఏం మీడియా) నాగరాజు, జర్నలిస్టులు పాల్గొన్నారు.