Listen to this article

జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 3 ఆగస్టు 2025 నాడు విజయనగరం లోని సోమస్కంద పీఠంలో అర్చకుల సన్మాన మహో త్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు ముఖ్య అతిధి గా పీఠం అధినేత బ్రహ్మశ్రీ పులఖండం సంతోష్ శర్మ పాల్గొని ప్రసంగిస్తూ బ్రాహ్మణులకు తోడ్పాటు అందించడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిరంతరం కృషి చేయడం అద్భుతమైన విషయమని ఈ ఒరవడి విశ్వ వ్యాప్తం చేస్తూ బ్రాహ్మణుల సంఘటితం కోసం ప్రయత్నం చేయాలని కోరారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీకాకుళం వర్కింగ్ ప్రెసిడెంట్ ఫణిబాబు మాట్లాడుతూ వేదిక నిర్వ హిస్తున్న వేడుకలు అన్ని అద్భుతంగా ఉన్నాయని సమాఖ్య చేసే సంక్షేమ పథకాలను బ్రాహ్మణులందరు అందుకోవాలని పిలుపు నిచ్చారు బ్రాహ్మణుల ఐక్యత కోసం రెండు తెలుగు రాష్ట్రా లలో అనేక ప్రాంతాలలో సమావేశాలు ఏర్పాటు చేసి, అర్చకులను,పురోహితులను ఏకం చేస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వేదికకు బ్రాహ్మణు లందరు పూర్తి సహాయ సహకారాలను అంద చేయాలని వారు విజ్ఞప్తి చేశారు జాయింట్ సెక్రటరీ నేరళ్ళ మల్లికార్జున మాట్లాడు తూ అన్ని సంఘాల లోని బ్రాహ్మణులందరికీ మా వేదిక పథకాలను ఉచితంగా అంది స్తుందని చెప్పారు అంతేకాక రాబోయే రోజులలో అన్ని రాష్ట్రాలలో కార్యక్రమాలు విస్తరిస్తుందని చెప్పారు బ్రాహ్మణులందరు పని చేసే సంఘాలకు మద్దతు తెలియ చేయాలని కోరారు మరొక జాయింట్ సెక్రటరీ చోడవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక హాస్పిటల్స్ లో విద్య సంస్థల లో వ్యాపార సంస్థలతో రాయితీలతో ఒప్పందం చేసు కొని బ్రాహ్మణులందరికీ సేవల ను అందిస్తున్నామని వాటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సింహాచలం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరగవరపు వెంకట లక్ష్మీనరసింహం మాట్లాడు తూ ఎన్నో సంఘాలు ఉన్నాయి కాని పని చేసే సంఘం మాత్రమే మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని సభికుల హర్షద్వానాల మధ్య తెలిపారు వారు మాట్లాడు తూ గత సంవత్సరం విశాఖ లో నిర్వహించిన వేడుక లో భారీఎత్తున బ్రాహ్మణ సభ్యులు విచ్చేశారని వారందరు ఇప్పటికి తమ సహాయ సహకారాలను అందిస్తున్నారని తెలిపారు విశాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడు తూ బ్రాహ్మణులలో అహం కారం తగ్గాలని అన్ని కులాల తో మమేకమై మన శక్తి పెంచుకోవాలని తద్వారా ధార్మిక వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తే హిందూ శక్తి బలపడుతుందన్నారు అనకాపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏలూరు రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకకు గత నెల రోజులుగా కృషి చేశామని ఈ పీఠం అధినేతకు పాల్గొన్న అర్చక మహాశయులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ అలాగే విజయనగరం వర్కింగ్ ప్రెసిడెంట్ అతి త్వరలో నియమిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమానికి ఏలూరి నరసింహ రావు గారు దంపతులు మరియు రమేష్ గారు స్పందన గారు జగన్నాధ శర్మగారు గురునాథ శర్మ గారు ధన సహాయాన్ని అందించడం జరిగింది. ప్రసంగాల అనంతరం జరిగిన సన్మాన వేడుకలో దాదాపు 50 మంది వేద పండితులను అర్చక మహాశయులను బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముఖ్య అతిధుల చేతులమీదుగా ఘనంగా సత్కరించారు.