Listen to this article

జనంన్యూస్. జనవరి. 27. : నిజామాబాదు. ప్రతినిధి. జిల్లా లోని ప్రాజెక్టు రామడుగు, సిరికొండ పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ. డిమాండ్ ప్రాజెక్టు రామడుగు,సిరికొండ భూములపై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని, ప్రాజెక్టు రామడుగు, సిరికొండ పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ.డిమాండ్ చేశారు. సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణిలో మోమోరాండం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తు ప్రాజెక్టు రామాడుగు గ్రామములో సర్వే 1150 నంబర్ లో 2005లో ఆనాటి ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి 250 మంది లబ్ధిదారులకు పట్టాలు 2005 సంవత్సరంలో ఇచ్చింది. కొందరికి రిజిస్టర్ పాసుబుక్కులు కూడా వచ్చినాయి. ప్రభుత్వం సి ఎల్ డి పి పథకం కింద నిధులు మంజూరు చేసి భూమి చదును చేసి ఒడ్లు కోసం అంట పొలాలు వేసుకోవడానికి అనుకూలంగా అభివృద్ధి చేసింది. కొందరు లబ్ధిదారులకు కొన్ని బ్యాంకులలో క్రాప్ లోన్స్ కూడా తీసుకున్నారు. భూములను ఇంత చదలు చేసి చదునుకు అనుకూలంగా తయారు చేసుకున్నాక ఇది ఇప్పుడు అటవి శాఖ అధికారులు ఈ భూములు మొండి వాహనకు దిగుతున్నారు. బలవంతంగా లబ్ధిదారులను అడ్డుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా గంపేడు ఆశతో బతుకుతున్న నోట్లో పట్టుకోడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.సిరికొండ మండల కేంద్రం కు చెందిన సర్వేనెంబర్ :532 లో 166 మందికి పట్టాలు ఇచ్చారు. హైకోర్టు కూడా లబ్ధిదారులకు అనుకూలంగా ఇక్కడ తీర్పు ఇచ్చినప్పటికిని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఇలా అడ్డుకోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు ఫాలో అవుతున్నారు. కావున తమరు విశాల హృదయంతో ఆలోచించి ధర్పల్లి మండలంలోని ప్రాజెక్ట్ రామడుగు , సిరికొండ లబ్ధిదారులకు ఇట్టి భూములు అందేలాగా చర్యలు తీసుకొని తగిన న్యాయం చేసి ఫారెస్ట్ అధికారులను ఈ భూముల జోలికిరాకుండా.ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్ లైన్ జిల్లా నాయకులు . రమేష్, డివిజన్ నాయకులు దామోదర్, ప్రాజెక్ట్ రామడుగు, సిరికొండ లబ్ధిదారులు గంగాధర్, నాగన్న, అనిల్,రవి,.శ్రీనివాస్, .శంకర్,.శంకర్, .ఎల్లన్న, తదితరులు పాల్గొన్నారు.