

జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
భోగాపురంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి 3వ తరగతి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. విజయనగరానికి చెందిన విజయ్ కుమార్ మరో మహిళతో కలిసి ట్యూషన్ చెప్తాడు. శనివారం మహిళా టీచర్ రాకపోవడంతో ఓ బాలికను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు.
విషయం తల్లిదండ్రులకు తెలియడంతో సోమవారం చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.