Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

విద్యార్థినీ విద్యార్థులు పాఠ్యాంశాలపైనే కాకుండా క్రీడల పైన కూడా దృష్టి పెట్టాలి.జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బాక్సింగ్ విభాగంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన నందలూరు గ్రామ విఆర్ఓ జగదీష్ ను సోమవారం మధ్యాహ్నం రాయచోటి కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాక్సింగ్ విభాగంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు పొందిన ఎం.జగదీష్ క్రీడలలో ఎంతోమందికి ఆదర్శప్రాయమన్నారు. అన్నమయ్య జిల్లా యువత జగదీష్ ను ఆదర్శంగా తీసుకొని అన్ని రకాల క్రీడలలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేయాలన్నారు. వీఆర్వో జగదీష్ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో పథకాలు పొందేలా శిక్షణ ఇచ్చిన ఆయన కోచ్ ఆనంద్ ను కూడా ఈ సందర్భంగా సన్మానించి,మరింత మంది క్రీడాకారులను ఈ స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని సూచించారు.