Listen to this article

అంగన్వాడి టీచర్ ప్రేమల,

జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ముడవ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల వరోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. చిన్నారుల తల్లులను తల్లిపాల విశిష్టతను తెలియపరిచారు.ప్రతి తల్లి తమ పిల్లలకు డబ్బాపాలు తాపకుండా తమ పిల్లలు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలంటే కచ్చితంగా తల్లిపాలని తాపాలని సూచించారు.తల్లిపాలు తాపడం వలన చిన్నారులు శారీరక దృఢత్వంతో పాటు, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని అన్నారు.గర్భిణీలు గర్భం దాల్చిన నుంచి తూచా తప్పకుండా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యంతో పాటు,తమ గర్భంలో పెరుగుతున్న శిష్పు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉందని అన్నారు.తల్లి పాలు ఎందుకు ముఖ్యం?
తల్లి పాలలో శిశువుకు మొదటి 6 నెలల్లో అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి , వాటిలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు నీరు (1,2,3,4) ఉన్నాయి. ఇది సులభంగా జీర్ణమవుతుంది అని అన్నారు.రొమ్ము పాలు ప్రయోజనాలు మీ బిడ్డలో అలెర్జీలు రాకుండా తల్లిపాలు సహాయపడతాయి, జలుబు,చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వంటి అనారోగ్యాల నుంచి తల్లిపాలు మీ బిడ్డను రక్షించడంలో సహాయపడతాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయ లలిత,బాలింతలు,గర్భిణీలు,తదితరులు పాల్గొన్నారు.