

రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండు వెంకటేష్
జనం న్యూస్ ఆగస్టు 05 వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర డీలర్ పెంటయ్య తో కలిసి ఎర్రవండ్ల సదానందం కు రేషన్ కార్డు అందజేసిన రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండు వెంకటేష్.గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసు, పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డు మరియు సన్న బియ్యం ఇచ్చే చక్కటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. వారికి రాపోలు గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమంలో పి నాగవర్ధన్, గండు రవికుమార్, గ్రామ సెక్రెటరీ బుచ్చయ్య, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.