

జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఆగస్టు 7న హనుమకొండ జిల్లా చేయూత వికలాంగుల పెన్షన్ పెరుగుదలకు జిల్లా మహాసభను విజయవంతం చేయండి. హన్మకొండ జిల్లా శాయంపేట మండల ఇంచార్జ్ మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వై కే విశ్వనాధ్ మాదిగ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ కందుకూరి సోమన్న మాదిగ హనుమకొండ జిల్లా ఇన్చార్జ్, మాట్లాడుతూ ఈనెల 7నా హసిన్ పర్తి మండలం చింతగట్టులో ఎం టీ ఆర్ గార్డెన్లో వికలాంగుల చేయూత పెంచన్ దారుల జిల్లా మహాసభను విజయవంతం చేయాలని వై కే విశ్వనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం వెంకటేష్ మాదిగ మండల కో ఇన్చార్జ్, మారేపల్లి చిరంజీవి ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ,కనకం సురేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి, వి హెచ్ పి ఎస్ కొప్పుల గ్రామ అధ్యక్షులు జలుగూరి మహేష్, వి హెచ్ పి ఎస్ కొప్పుల గ్రామ ప్రధాన కార్యదర్శి సామల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు….