

బిచ్కుంద ఆగస్టు 5 జనం న్యూస్
బాజాపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మహాసంపర్క్ అభియాన్‌లో భాగంగా నేడు బిచ్కుంద మండలంలో పెద్ద దడ్గీ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై కరపత్రాలు, స్టిక్కర్ ల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు అరుణ తార, బిజెపి బిచ్కుంద మండల అధ్యక్షులు విష్ణు, సెక్రెటరీ ముత్యం పిరాజీ, పెద్ద దడిగి బూత్ అధ్యక్షులు ఆకుల లాలూ, బిజెపి సీనియర్ నాయకులు సహదేవ్ పటేల్, మల్లికార్జున్ దేశయి, మండల ఉప అధ్యక్షులు గణపతి, కార్యదర్శి రవి, మల్లు దేశయి, మొగులుగొండ తదితరులు పాల్గొనడం జరిగింది.
