Listen to this article

జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాసిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం లోని రవీందర్ నగర్ నుండి బూరెపల్లి వరకు గత సంవత్సరాలనుండి బస్ సౌక్యర్యం ఉన్న ఈ సంవత్సరము సౌక్యర్యం లేక పలు గ్రామాల పల్లెవాసులు ఇబ్బందులు ఎదురుకొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టినప్పటినుండి మాకు బస్ సౌకర్యం లేదని,విద్యార్థులకుపాఠశాలలకు, కాలేజీకి వెళ్లాలంటే ఇబ్బదులు అవుతుందని,బస్ సౌక్యర్యం లేక రాత్రి వేళలో భయబ్రాంతులకు గురి అవుతున్నామని, నచుకుంటూ వెళ్ళ వాల్సి వస్తుందని, చిన్న పిల్ల లను పట్టుకొని నడిచి వెళ్తుమని,కాగజ్ నగర్ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆటోలు అధికరేట్లు తీసుకుంటున్నరని, దూర ప్రాంతాలకు వెళ్లాలంటే సామాన్యుడు, నిరుపేదలు ఇక్కట్లు తప్పడం లేదని, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని. స్థానిక నాయకులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని, ఇబ్బందులు తొలగించాలని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా కాగజ్ నగర్ నుండి బూరెపల్లి వయా బాబాపూర్, మీదుగా బస్ సౌక్యర్యం కలిపించాలని ఆయా గ్రామస్తులు మీడియాకు తెలిపారు.