Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

BSP పలనాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు డిమాండ్

బిజెపి జండాలను తొలగించిన బీఎస్పీ నాయకులు

ఈరోజు నరసరావుపేట పట్టణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నరసరావుపేటకు వచ్చిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ బిజెపి నాయకులు ఆ పార్టీ జెండాలతో అలంకరించటం జరిగినది ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు మాట్లాడుతూ తన జీవితం మొత్తం మనుధర్మ శాస్త్రానికి మరియు కులతత్వానికి మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎన్నో ప్రయాసాలకు ఓర్చు భారత రాజ్యాంగాన్ని రచించాడని ఈరోజు కేంద్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలో ఉన్న బిజెపి మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని ఎన్నోసార్లు పార్లమెంట్ లోనే ప్రకటించిన వ్యక్తులు ఆయన విగ్రహం దగ్గర బిజెపి జెండాలు కట్టడం అంటే అంబేద్కర్ ని అవమానించటమేనని వెంటనే బిజెపి నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కనీసం ఆయన విగ్రహానికి పూలమాల కూడా వేయకుండా అవమానపరిచారని తెలిపారు ఏ రాజకీయ పార్టీ నాయకులైన అంబేద్కర్ విగ్రహం వద్ద మీ జెండాలు పెట్టవద్దని ఈ దేశం మరియు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలేనని భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టో గా పెట్టుకున్నా ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని తెలిపారు తక్షణమే బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలని కోరారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా భూదాల బాబురావు జిల్లా నాయకులు వేల్పుల రాంబాబు రొంపిచర్ల మండల అధ్యక్షులుదానియేలు ఎలీషా ప్రేమ్ కుమార్ నాగేశ్వరరావు గాలయ్య చంటి మరియు bsp నాయకులు పాల్గొన్నారు