

జనంన్యూస్. 05. నిజామాబాదు.
నిజామాబాద్ పట్టణం లోని ఆర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించి నట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు..మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఔషద మొక్కల ప్రాధాన్యత మన చుట్టూ ఉండే మొక్కల ప్రాధాన్యత గురుంచి వివరించారు మారుతున్న జీవన శైలిలో మార్పులు దినచర్య,ఋతు చర్య, ఆయుష్ వైద్యం తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని దీర్ఘ కాలిక వ్యాధులకు మంచి ఫలితాలు ఉంటాయి అని తెలిపారు.. యోగ వైద్యుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ ప్రకృతి వైద్యం గురుంచి డైట్, న్యూట్రిషన్ ఆహారం మరియు ఆహారం నిత్య యోగ సాధన ద్వారా ఆరోగ్య వంతులుగా ఉంటారని తెలిపారు.. యోగ శిక్షకులు ఆశ కార్య కర్తలకు యోగ ఆసనాలు వేయించి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ కొరకు చేసే ఆసనాలు వేయించారు.. ఈ కార్యక్రమం లో డాక్టర్ అజ్మత్ ఉన్నిస ఆయుష్ విభాగం ఫార్మ శిష్ట్స్ న్యవానండి పురు షో తం, ఉమా ప్రసాద్. హెచ్ ఈ ఓ. గిరిధర్, పీహెన్ రాణి, సి ఓ వెంకటేష్ , ఏఎన్ఎం లు , ఆరోగ్య కేంద్రం సిబ్బంది. యోగా శిక్షకులు, ఆయుష్ పారా మెడికల్ సిబ్బంది రమేష్ భిక్షపతి పాల్గొన్నారు