Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గ, గరుడ ఏజెన్సీ లో పనిచేసే సెక్యూరిటీ రాజు తను పనిచేసే సమయంలో దొంగతనానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి నీ అడ్డుకోవడం తో వారు అతనిపై తలపై రాడుతూ దాడి చేసి చంపేయడం జరిగింది… గరుడ ఏజెన్సీ యాజమాన్యాన్ని రాజు కుటుంబ సభ్యుల నష్టపరిహారం కోరగా, గరుడ ఏజెన్సీ యాజమాన్యం దానిని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు.. ఈ విషయాన్ని స్థానిక కార్మికుల ద్వారా ఎవరైతే మనకు న్యాయం చేస్తారని తెలుసుకొని బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరగాలని కోరారు విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిగా గరుడ ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి సెక్యూరిటీ గార్డ్ రాజు కుటుంబానికి తగిన సాయం చేయాలని నిర్లక్ష్యం వహించద్దని యజమాన్యానికి విజ్ఞప్తి చేశారు కార్మిక నాయకుడు రవి విజ్ఞప్తి మేరకు రాజుకి యజమాన్యం తరపున నష్టపరిహారం ఏడు లక్షల యాబై వేలు రూపాయలు… ఆ కుటుంబ సభ్యులకు ఇప్పించడం జరిగింది… రాజు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మంచి మనసుతో మానవత దృక్పథంతో మా కుటుంబానికి సహాయం చేసినందుకు రవికి వాళ్ళ బృందానికి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…. ఈ కార్యక్రమంలో అనిల్,సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు…