Listen to this article

జనంన్యూస్. జనవరి. 27.నిజామాబాదు. ప్రతినిధి.అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ.ఇందూర్ నగరం ఇందూర్ భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో వినాయక నగర్ బస్వ గార్డెన్లో గత ఏడు రోజులుగా బ్రహ్మ శ్రీ ఫణతుల మేఘరాజ్ శర్మ గారిచే శ్రీ శివ పురాణ ప్రవచనము నిర్వహించడం జరుగుతుంది నేడు చివరి రోజు శివపార్వాతుల కళ్యాణనికి వేల సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ అంగరంగ వైభోవంగా కల్యాణమహోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరై ప్రత్యేక పూజ,కళ్యాణం, హారతి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు హిందూ ధర్మంలో జరిగే పెళ్ళి, కన్యధానం, దాంపత్యం యొక్క గొప్పతనం వల్లే ప్రచాత్య దేశాలకు మన సంస్కృతి, సంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి అన్నారు.ఆదర్శ దంపతులైన శివపార్వతులు దాంపత్యం జీవనం సాగించే అందరికి ఆదర్శం అన్నారు, మహాశివుడు పార్వతి దేవిని గౌరవించి అర్థ శరీరభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి సమస్త మానవాళికి స్త్రీగా భార్యను ఎలా గౌరవించలో గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నారు.సనాతన ధర్మ రక్షణకు కంకణ బద్దులై హిందూ జాతిని జాగృతం చేయడంలో ఇందూర్ భక్త బృందం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు.అనంతరం భక్తులకు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆగమయ్య గురుస్వామి, చెన్న గంగరత్నం, పార్శి రాజు, ఎంసాని రవి, లభిశెట్టి శ్రీనివాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.