

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అరచేతిలో ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ పథకాలు స్పెషల్ ఆఫీసర్ గుణశేఖర్ పిళ్ళై, ఎంపీడీవో రాధాకృష్ణన్, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ర్యాలీ మంగళవారం నిర్వహించారు అనంతరం సచివాల యంలో నిర్వహించిన పి 4 గ్రామసభలో నందలూరు జిల్లా పశు సంక్షేమ శాఖ స్పెషల్ ఆఫీసర్ గుణశేఖర్ పెళ్లై ,ఎంపీడీవో రాధాకృష్ణన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు గురించి కలెక్టర్ ఆదేశాల మేరకు మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి వీలుగా ఉంటుం దని మనమిత్ర 955 23 00 00 9 కు వాట్సప్ ద్వారా 200 ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించ వలసిందిగా సచివాలయం సిబ్బందికి తెలియజేశారు, నాగిరెడ్డి పల్లె నందలూరు సచివాలయా లలో ఇప్పటివరకు 100బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసేందుకు ట్రస్టులు గానీ గ్రామ పెద్దలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు,ఈ సమావేశంలో నాగిరెడ్డి పల్లె పంచాయతీ కార్యదర్శి బండ్ల సురేష్ కుమార్, నాగిరెడ్డిపల్లె 2 వెంకటరమణ, నాగిరెడ్డిపల్లె 3 వెంకటసుబ్బయ్య సచివాలయ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు,