Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రేపు జరుగుతున్నoదున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటిన నేటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయలేదని తెలిపారు.కావున రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు గురించి చర్చించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుందని రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నికలు వచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చలేదని తెలిపారు జూన్ నెలలో బదిలీలు జరిగిన 60 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు నేటికీ జీతాలు అందలేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసినందున 12వ వేతన సవరణ సంఘం కమిటీ చైర్మన్ నియమించాలని ఈలోగా 30%మధ్యంతర భృతి (ఐ అర్ )ప్రకటించాలని కోరడం జరిగింది. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిలు, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో భాగంగానే గుర్తించాలని ఎన్నికల హామీల్లో ఉద్యోగ ఉపాధ్యాయ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని ఎటువంటి బకాయిలు లేకుండా బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు కావున వీలైనంత త్వరగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీతో ఏర్పాటు చేసి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ఉపాద్యాయ సంఘం డిమాండ్ చేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో ఎస్టియు పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య పట్టణ అధ్యక్షులు కే కోటేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి వి జయప్రకాష్ నాదెండ్ల మండల అధ్యక్షులు షేక్ మక్బూల్ బాషా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ఎడ్లపాడు మండల అధ్యక్షులు జి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి ప్రధాన కార్యదర్శి మస్తాన్వలి సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు