

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
కూటమి ప్రభుత్వం ఈనెల 9న గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని యనార్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది గిరిజన దినోత్సవానికి ఆయా జిల్లాలకు అర కోరా నిధులు కేటాయించి, తూ..తూ మంత్రంగా నిర్వహించారని తెలిపారు.ఈ ఏడాది ప్రతి జిల్లాకు అధిక నిధులు కేటాయించి ఘనంగా గిరిజన దినోత్సవం నిర్వహించేలా ప్రభుత్వం చూడాలని పేర్కొన్నారు. ఏడాదికి ఒకసారి జరిపే గిరిజన దినోత్సవం రోజున సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానలను అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వ విఫలమవుతుందని, పథకాలు అందే విధంగా చూడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పై ఉందన్నారు.