

జనం న్యూస్ 6 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్).
ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో మంగళవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం,వరంగల్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ వెంకట్ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త, బృందం ఏ డి ఏ శ్రీ డి.ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పంట పొలాల సందర్శన చేయడం జరిగింది. ఇందులో బాగంగా మొక్కజొన్న పంట లో పోషకాల లోపం నల్ల తామర పురుగుల ఉధృతిని గమనించారు.అదేవిధంగా పత్తిలో పేనుబంక, పచ్చదోమ తామర పురుగుల ఉదృతి ఉంది అని గమనించారు. ప్రస్తుతం బెట్ట పరిస్థితులలో పత్తిలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉన్నదని గుర్తించారు. వీటి నివారణకు ఆసిటమీప్రిడ్ 40 గ్రామ్స్ ఎకరానికి, థయామితక్సమ్ 40 గ్రామ్స్ ఎకరానికి నీమ్ ఆయిల్ తో కలిపి పిచికారి చేయాలి అన్నారు. మొక్కజొన్నలో ఎరువుల యజమాన్యం చేపట్టాలని చెప్పారు. తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 400 గ్రామ్స్ ఎకరానికి పిచికారి చేయాలి అన్నారు. పెంచికలపేట గ్రామంలో మొక్కజొన్నలో పోషకాల లోపం గుర్తించడం జరిగింది, దీని నివారణకి గాను నత్రజని ఎరువులు మంచి పదను లో వేసుకోవాలి అదే విధంగా పై పాటుగా సూక్ష్మ పోషకాలైనటువంటి 19:19:19, లేదా మల్టీకే 10 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి, పిచికారీ చేసే టపుడు ఆకుల అడుగుభాగం పూర్తిగా తాడిసేలా జాగ్రత్త వహించాలి అలాగే సిఫారసు లేని బయో మందులను పిచికారీ చేయరాదు, ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. వెంకటరెడ్డి, డా. రాములు డా. పద్మజ, డా. మధు, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆది రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఎం రాజ్ కుమార్ ఎల్కతుర్తి ఏఈఓ తిరుపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
