Listen to this article

రంగారెడ్డి జిల్లా నుంచి స్నేహితులతో కలసి నాగార్జునసాగర్ డ్యాం చూడటానికి వచ్చిన యువకుడి మిస్సింగ్

జనం న్యూస్ – ఆగస్టు 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు మిస్సింగ్ కేసు నమోదు అయింది, నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారంసోమవారం రాత్రి 6:30 సమయంలో మంథని శివ(23) సంవత్సరాలు జపాల్ గ్రామం మంచాల మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులు ప్రసాద్, శివ, నరసింహల తో కలసి నాగార్జునసాగర్ డ్యాం చూడటానికి వచ్చి కొత్త బ్రిడ్జి వద్ద నిలబడి ఫోటోలు దిగుతుండగా మంథని శివ తండ్రి పేరు కొమరయ్య కొత్త బ్రిడ్జి పైనుంచి కృష్ణా నదిలోకి దూకారని స్నేహితుల ద్వారా తెలుసుకున్న శివ తండ్రి మంథని కొమరయ్య ఈరోజు 5:8:2025న నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య, హాలియా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 19 మంది తొ కలిసి కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టామని నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.