Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

డిప్లమా, ఇంజనీరింగు, డిగ్రీ మరియు టెక్నికల్ గ్రాడ్యుయేట్లును లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడే ముఠాలు, ప్రైవేటు సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిరుద్యోగ యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆగస్టు 5న పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – డిప్లమా, ఇంజనీరింగు, డిగ్రీ, టెక్నికల్ గ్రాడ్యుయేట్లును లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి, మోసాలకు పాల్పడే ఏజన్సీలు, ముఠాలు పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులకు విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని, లక్షల్లో జీతాలు చెల్లిస్తామని, ఆశావహుల నుండి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లుగా కొన్ని సంఘటనలు ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లో వెలుగు చూసాయన్నారు. యువత ఆసక్తిని గమనించి కొన్ని ఏజన్సీలు, ముఠాలకు సంబంధించిన వ్యక్తులు నిరుద్యోగులను ఆకర్షించేందుకు కొన్ని సందేశాలను వాట్సాప్,టెలిగ్రాం యాప్లలో పంపి, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మిస్తారన్నారు. విదేశాల్లో పని చేయుటకు ఆసక్తి కనబర్చిన యువతకు కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించి, ఆసక్తి, చదువుతో సంబంధం లేని ఉద్యోగాల్లో నియమించి, వారితో సైబరు నేరాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చేయిస్తారన్నారు. వారి ఇష్టంతో పని లేకుండా సైబరు నేరాల్లోను, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోను భాగస్వాములను చేస్తారన్నారు. కొన్ని మాసాల్లో అన్ని
విషయాలు చక్కబడతాయని నమ్మిస్తారన్నారు. ఈ తరహా ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి కనబర్చని ఉద్యోగుల నుండి పాస్పోర్టులను, ఇతర విలువైన డాక్యుమెంట్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని, వారిని గుర్తుతెలియని ప్రాంతాలకు తరలించి, డార్క్ రూమ్స్ లో నిర్భందించి, శారీరక, మానసిక వేధింపులకు పాల్పడతారన్నారు. కావున, ఇటువంటి ప్రైవేటు ఏజన్సీలు, సంస్థలు పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, విదేశీ ఉద్యోగాల మోజులో భోగస్ ఏజన్సీలు, ముఠాల ఉచ్చులో చిక్కుకోవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు పిలుపునిచ్చారు.విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న ఆసక్తి ఉన్న యువత ముందుగా తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న సంస్థలు, ఏజన్సీల గురించి తెలుసుకోవాలని, ఆయా సంస్థల గురించి విచారణ చేసుకొని, పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతనే ముందుకు వెళ్ళాలన్నారు. అవసరమైతే స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలని ప్రజలతను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.