Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ అన్నారు తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశువు పుట్టిన గంటలో పై ముర్రుపాలు పట్టించాలని అన్నారు పుట్టిన శిశువు కు తల్లి పాలు ఒక వరం లాంటిదని వాటిని మించిన పౌష్టికాహారం మరొకటి లేదని బిడ్డ పుట్టిన రోజు నుండి ఆరు నెలల వరకు తల్లిపాలే తాగించాలని తెలిపారు తల్లిపాల ప్రాముఖ్యత పై గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లు లకు అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటేశ్వర వర్మ చలపతి మల్లేశం ఏ ఎన్ ఎం శ్రావణి ఆశ కార్యకర్తలు లత కవిత ప్రేమలత అంగన్వాడీ టీచర్లు కవిత పుష్ప శ్వేత జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు….