

జనం న్యూస్. ఆగస్టు5. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
మండల కేంద్రమైన హత్నూర గ్రామం నుండి దౌల్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగామారి అటు ప్రజలు ఇటు వాహనదారులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హత్నూర గ్రామ యువకులు ఈ విషయాన్ని స్థానిక ఎస్సై శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే స్పందించిన హత్నూర ఎస్సై గుంతల మయంగా మారిన ప్రధాన రహదారిపై వాహనదారులు ప్రయాణించే క్రమంలో వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎంతో ఉందని గ్రహించిన ఆయన గుంతలు ఏర్పడి నాసిరకంగా మారిన ప్రధాన రహదారిని మరమ్మతులు చేయించడం జరిగింది.దీంతో వాహనదారులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
