

జనం న్యూస్,జనవరి 27 తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం వేల సంవత్సరముల చీకటిని పారద్రోలి ప్రపంచ మానవాళికి వెలుగును ప్రసాదించిన మహానుభావుడు థామస్ హల్వా ఎడిషన్ 1980 జనవరి 27న విద్యుత్ బల్బు కనుగొన్న సందర్భంలో ఎలక్ట్రిషన్ డే గా ఆవిర్భవించిందిఈ సందర్భంగా పెరవలి మండల ఎలక్ట్రిషన్ & ప్లంబింగ్ యూనియన్ సభ్యులు ఘనంగా ఎలక్ట్రిషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందుగా యూనియన్ సభ్యులందరూ పెరవలి బైపాస్ నుండి ఎలక్ట్రిషన్ ప్లంబింగ్ యూనియన్ ఐక్యత వర్ధిల్లాలి నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించి పెరవలి కమ్యూనిటీ నందు జండా ఆవిష్కరణ చేసి నివాళులర్పించారు.అనంతరం యూనియన్ యొక్క అభివృద్ధి ప్రణాళికలతో ఎలా ముందుకెళ్లాలి యూనియన్ ఉపయోగాలు విధానాలను పిట్ల వేమవరం యూనియన్ సభ లోవ్యక్తులు వివరించారు. చివరిగా యూనియన్ సభ్యులు ఆత్మీయ విందు ఏర్పాటు చేసుకుని ఐక్యత చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పెరవలి మండల ప్రెసిడెంట్ పురెళ్ళ ధనరాజు, సెక్రటరీ పంపన వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సెక్రటరీ బి .కిరణ్ రాజు, క్యాషియర్ కంతేటి సుబ్బారావు, తణుకు మండలం యూనియన్ సభ్యులు కేత విజయ్ కుమార్, వీర వెంకట సత్యనారాయణ, సత్యనారాయణ, కేత గంగాధర్, యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.