Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్‌లో డాక్టర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగా నిలిచిన డా. జయశంకర్ చూపిన మార్గంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారని ఆయన ఆశయాలే మా ప్రేరణ. అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసిన గొప్ప నాయకుడు డా. కె. జయశంకర్ అని ఆయన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంకితం చేశారని ఆఖరి శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు ఆయన ఆలోచనలు, శాస్త్రీయ విశ్లేషణలు, ఉద్యమ పటిమ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన పాత్ర అపూర్వమైనది. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను దేశం మొత్తం ముందుంచిన వ్యక్తి డా. జయశంకర్ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, తెలంగాణకు సమగ్ర అభివృద్ధి తీసుకురావడమే ఆయనకు మనము అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు,మాచర్ల భద్రయ్య,బాబు, పర్వతాల సతీష్,తీగల కృష్ణారావు, మోహన్ రావు, విద్యాసాగర్, అఖిల్, వాసు,ప్రవీణ్, కేబుల్ రమేష్, రాజు , వెంకటేశ్వరరావు, రవీందర్ రావు,బచ్చు హరీష్, సంతోష్,నరహరి గౌడ్,హరీష్ నవీన్ , రాధిక అనిత,శ్రావణి, శైలజ,రాధ తదితరులు పాలుగొన్నారు.