

అభినందించిన బేస్తవారిపేట టీడీపీ నాయకులు
కంభం ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్):
ప్రకాశం జిల్లా, కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కంభం చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి ని బుధవారం నాడు కంభం మార్కెట్ యార్డ్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ లో శాలువలతో, పూలమాలతో, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట టీడీపీ మండల అధ్యక్షుడు సోరెడ్డి మోహన్ రెడ్డి, బేస్తవారిపేట టౌన్ న్యూ స్వప్న హోటల్ అధినేత సత్యేలి కృష్ణ యాదవ్, టౌన్ అధ్యక్షుడు సైదులు, బీసీ కాలనీ వార్డ్ మెంబర్ దూదేకుల శివ, బేస్తవారిపేట మండల టీడీపీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.